NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పవన్ కళ్యాణ్ తీరు పై మండి పడ్డ వైయస్సార్​సిపి ఎమ్మెల్యే

1 min read

ఆలూరు, న్యూస్​  నేడు:  నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి  నివాసం నందు మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ తీరు పై మండి పడ్డ ఆలూరు నియోజకవర్గం వైయస్సార్​సిపి ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి . ఆలూరు నియోజకవర్గం వైయస్సార్​సిపి ఎమ్మెల్యే విరుపాక్షి  మాట్లాడుతూ….కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. తప్ప ప్రజల కి ఇచ్చి హామీలను నెరవేర్చడం లేదు..తిరుమల లడ్డును అనవసరంగా కల్తీ చేసారంటు అసత్య ప్రచారలు చేస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్  సిబిఐ  అధికారులు తిరుమల లడ్డులో కల్తీ జరగలేదు అంటూ క్లియర్ గా చెప్పడం జరిగింది. అని అన్నారు.మీరు ముందు ఎన్నికలో ఇచ్చిన హామీలను నెరవేర్చండి అని తెలియజేశారు. ఆలూరు నియోజకవర్గం వైయస్సార్​సిపి ఎమ్మెల్యే    బుసినే విరుపాక్షి  ఈ మీడియా సమావేశంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి , శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పి చక్రపాణి రెడ్డి , కర్నూలు జిల్లా పార్లమెంట్ ఇంచార్జ్  బుట్టా రేణుక , వైయస్సార్​సిపి   నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author