బిజినవేముల పాఠశాలకు పూర్వ విద్యార్థుల చేయూత
1 min read

50 వేల విలువైన సామాగ్రి అందజేత..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లానందికొట్కూరు మండల పరిధిలోని బిజినవేముల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పూర్వ విద్యార్థులైన ప్రస్తుత సి బెళగల్ మోడల్ ప్రైమరీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న మురళీ,సీఐ హారూన్ బాష,ఎస్సై చంద్రశేఖర్, లెక్చరర్ మధుశేఖర్,టీచర్ మల్లేశ్వరి,పిడి చక్రపాణి, అన్నదాత ఫర్టిలైజర్స్ పిడి శేఖర్ యాదవ్,శ్రీరామ్ ఫైనాన్స్ మేనేజర్ వెంకటరమణ,సిఈఓ రబ్బానీ,మదీనా టైల్స్ అండ్ గ్రానైట్స్ ఆలీ భాష బిజినవేముల గ్రామ సర్పంచ్ రవి యాదవ్ మరియు గ్రామ పెద్దల సమక్షంలో పాఠశాల హెచ్ఎం నాగ ప్రసాద్, ఉపాధ్యాయులు పెరుమాళ్ళ రాజశేఖర్,శ్రీనివాసులు, పద్మావతి,జయంతిలకు 50 వేలు విలువ చేసే టేబుల్స్, నాలుగు కుర్చీలు,పుస్తకాల రాక్స్ అందజేశారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ బిజినవేమల ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.పాఠశాల హెచ్ఎం,ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులకు పాఠశాల కు అవసరమైన సామాగ్రిని అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.సర్పంచ్ రవి యాదవ్ పూర్వ విద్యార్థులను పూర్వ విద్యార్థులను అభినందించి ప్రభుత్వం తరఫున పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

