NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజల మానసిక ఉల్లాసానికి ఉద్యానవనాల అభివృద్ధి

1 min read

వీనస్ కాలనీ పార్కు అభివృద్ధికి మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన

నాణ్యతతో వేగంగా పనులు పూర్తి చేయాలి

ఎల్‌ఆర్‌యస్, బిపియస్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

కర్నూలు, న్యూస్​ నేడు:  శుక్రవారం నగర ప్రజల మానసిక ఉల్లాసం, ఆహ్లాదకర వాతావరణం కోసం ఉద్యానవనాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవార నగరంలోని వీనస్ కాలనీ పార్కులో రూ.45 లక్షల వ్యయంతో చేపట్టనున్న కాంపౌండ్ వాల్ నిర్మాణం, థెరప్యూటిక్ గార్డెన్ (పంచతత్వ నడక మార్గం), నడకబాట, గ్రీనరి ఏర్పాటు, 168 అడుగుల జాతీయ జెండా నిర్వహణ, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెరుగుతున్న నగరీకరణ నేపథ్యంలో ప్రజలకు ప్రశాంతత, ఆరోగ్యకర జీవనశైలి అందించడంలో ఉద్యానవనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు నిత్యం వినియోగించుకునేలా అన్ని మౌలిక సదుపాయాలతో పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా నగరంలో పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈఈ క్రిష్ణలత, టిఏఈలు పవన్, రాజేష్, బి.ఉదయ్, శానిటేషన్ ఇంస్పెక్టర్ మునిస్వామి, తదితరులు పాల్గొన్నారు.

About Author