రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా రూపొందిస్తాం
1 min read

కోకో పంటకు ఆయిల్ పామ్ పంట రీతిలో గిట్టుబాటు ధర కల్పించేందుకు కొత్త చట్టాన్ని తీసుకువస్తాం
నాణ్యమైన కోకో ఉత్పత్తిపై రైతులకు అవగాహన కలిగిస్తున్నాం
త్వరలో విజయవాడలో అంతర్జాతీయ హార్టికల్చర్ కాంక్లేవ్ సదస్సు నిర్వహిస్తాం
ఉద్యానవన పంటల అభివృద్ధి దిశగా రాష్ట్రం
ఏలూరులో రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును ప్రారంభించిన వ్యవసాయ శాఖా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. స్థానిక చింతలపూడి రోడ్డులోని బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్ ఫంక్షన్ హాలులో శుక్రవారం రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును మంత్రి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కోకో ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందన్నారు. కోకో పంటను మరింత విస్తీర్ణంలో పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన కోకో ఉత్పత్తి, సాగులో తీసుకోవలసిన మెళకువలు, మార్కెటింగ్ సౌకర్యాలు, తదితర అంశాలపై అధికారులు, ఉద్యానవన శాస్త్రవేత్తలతో కోకో అభ్యుదయ రైతులకు అవగాహన కలిగించడమే రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 44 వేల 984 ఎకరాలలో కోకో సాగవుతూ, 10 వేల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తితో దేశంలోనే ఏలూరు జిల్లా ప్రథమస్థానంలో ఉందన్నారు. స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా జిల్లా జిడిపి వృద్ధిలో లో ఉద్యానవన పంటల పాత్ర ప్రధానమైనదన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ కోకో ఉత్పత్తిలో దేశంలో చింతలపూడి నియోజకవర్గం ప్రథమస్థానంలో నిలుస్తుందన్నారు. విదేశాల నుండి కోకో మొక్కలు దిగుమతి చేసుకుని వినియోగిస్తే కోకో నాణ్యతనాణ్యమైన కోకో ఉత్పత్తి సాధించి, కోకో ధరలో విదేశాలతో పోటీపడవచ్చన్నారు.చాకొలేట్ ఆరోగ్యానికి మంచిదని, యూరప్ దేశాలలో సంవత్సరానికి 9 కేజీలకు పైగా చాకొలేట్ వినియోగం ఉంటె, మన దేశంలో కేవలం కేజీ మాత్రమే వినియోగిస్తున్నారన్నారు. .ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ని, ఎమ్మెల్యే లు, జిల్లా కలెక్టర్, హార్టికల్చర్ ఉన్నతాధికారులను దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీలు, బ్యాంకర్లు ఏర్పాటు చేసిన స్టాల్ల్స్ ను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు.

