యనమలకుదురు లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు పంపిణీ
1 min read
యనమలకుదురు, న్యూస్ నేడు : గ్రామంలో రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామా ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శొంఠి శివరామా ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ ఈనెల ఒక రోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని, ఉదయాన్నే లబ్ధిదారుని ఇంటికి వచ్చి సొమ్మును అందజేస్తుంటే వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.గత జగన్ రెడ్డి పాలెం లో పెన్షన్లు తీసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు పడే వారమని, వాలంటీర్లు కమిషన్ల కోరకు లబ్ధిదారులను ఎన్నో ఇబ్బందులకు గురి చేసేవారని లబ్ధిదారులు వాపోయారు.చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రతి నెల ఒకటో తారీఖున ఉదయాన్నే ఇంటికి వచ్చి మరీ పెన్షన్లు అందజేస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు అన్నారు.గ్రామాలలో కొత్త పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారని, వారికి త్వరలోనే కూటమి ప్రభుత్వం శుభవార్త చెబుతుందని స్థానిక నాయకులు భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


