నాటు సారా తయారీదారులకు ‘ ఉపాధి ‘
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బంగారుపేట నీలి షికారి వాసులకు నవోదయo 2.0 కార్యక్రమం క్రింద నాటుసారా మానిన కుటుంబాలకు ఉపాధి కల్పనా చర్యల్లో భాగంగా ఈరోజు గౌరవ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కర్నూలు డాక్టర్ ఏ సిరి చేతుల మీదుగా నీలి షికారి వాసులకు ఆటోలు, మిల్లర్లు, తోపుడు బండ్లు మరియు రుణాలు ఇవ్వడం జరిగినది. ఈ విలువ మొత్తం 20 లక్షల రూపాయలు ఇండియన్ బ్యాంక్ వారి సౌజన్యంతో నీలి షికారి వారికి చెక్కు రూపంలో అందజేయడం జరిగినది. అనంతరం కలెక్టర్ బజాజ్ కంపెనీ కి చెందిన నాలుగు ఆటోలను,రెండు మిల్లర్లను, ఐదు మందికి వివిధ రకాల లోన్లను మరియు పదిమందికి తోపుడుబండ్లను పంపిణీ చేయడం జరిగినది. వారి వివరములు మెప్మా మరియు ఇండియన్ బ్యాంకు వారి సహకారంతో జరిగిన ఈ కార్యక్ర మానికి డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కర్నూలు శ్రీమతి పి శ్రీదేవి అసిస్టెంట్ కమిషనర్ ఆర్ హనుమంతరావు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ ఎం సుధీర్ బాబు మెప్మా పిడి శ్రీనివాసులు, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ శృతి రెడ్డి, మెషిన్ మేనేజర్ మెప్మా సుధాకర్ మరియు సుబ్బారెడ్డి సిపిఓ, ఏ ఈ ఎస్ లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి సిఐ లు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్, జయరాం నాయుడు మరియు ఎస్ఐలు దుర్గా నవీన్ బాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


