NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజా అంకితం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

1 min read

డిఐజి కోయ ప్రవీణ్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ

కర్నూలు ,  న్యూస్ నేడు : డిఐజి కోయ ప్రవీణ్ చేతుల మీదుగా ప్రజా అంకితం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రిక సమాజంలో ఒక శక్తివంతమైన సమాచార మాధ్యమంగాపనిచేస్తుందని. ప్రజలసమస్యలను, ఆశయాలను, అవసరాలను ప్రభుత్వానికి చేరవేయడంలో పత్రిక కీలక పాత్ర పోషిస్తుందని,అలాగే ప్రభుత్వం తీసుకునే విధానాలు,అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించి తెలియజేయడంలో కూడా పత్రిక వారధిగా నిలుస్తుంది.గ్రామస్థాయి సమస్యల నుండి రాష్ట్ర,జాతీయ స్థాయి అంశాల వరకు ప్రజల గళాన్ని పత్రిక బలంగా వినిపిస్తుంది.నిర్లక్ష్యానికి గురైన సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి,ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడంలో పత్రిక ప్రభావవంతమైన పాత్రను నిర్వహిస్తుంది.ఇదే విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని,వాటి వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించడం ద్వారా అపోహలను తొలగిస్తుంది.ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగవ స్థంభంగా పత్రిక వ్యవహరిస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా అంకితం ఎడిటర్ పెరుమాల.జయరాజు,బ్యూరో శివన్న తదితరులు పాల్గొన్నారు.

About Author