NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేదవారికి,ఆర్థికంగా తోడ్పాటు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి

1 min read

ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్

పెనమలూరు, న్యూస్​ నేడు: నియోజకవర్గం పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 36మందికి సుమారు 25 లక్షల 16వేల 848 రూపాయల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్  మాట్లాడుతూ…..నియోజకవర్గంలో పేద బడుగు వర్గాల ప్రజలు,హస్పిటల్ వెళ్లి నగదు చెల్లించిన పేదవారికి అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో,  ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  .  సిఎంఆర్​ఎఫ్​ ద్వారా ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఆయా వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని,గడచిన 18 నెల కాలం లో  1330 మందికి 12 కోట్ల 25 లక్షలు 45 వేల రూపాయల మేర పేదవారికి సిఎంఆర్​ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం చేయడం సంతోషంగా భావిసున్నాననీ, ముఖ్యమంత్రి  చంద్రబాబు  నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.ఈ కార్యక్రమంలో తాడిగడప మునిసిపాలిటీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్ రావురాష్ట్ర గౌడ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పితా గోపీచంద్ రాష్ట్ర రజకు కార్పొరేషన్ డైరెక్టర్ తాతపూడి గణేష్ రాష్ట్ర సగర కార్పొరేషన్ డైరెక్టర్ తాడిశెట్టి వీరాస్వామి పెనమలూరు మండల పార్టీ అధ్యక్షులు కోయ ఆనంద్ క్లస్టర్ ఇంచార్జ్ మార్పుడి ధన కోటేశ్వరరావు ఎంసీ చైర్మన్ అన్య ధనయ్య బిసి సెల్ అధ్యక్షులు సంగేపు రంగారావు క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మల రామ్ కుమార్ మహిళా అధ్యక్షురాలు మేడసాని రత్నకుమారి కూటమినాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author