NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బయో రిసోర్స్ సెంటర్‌,సేంద్రియ కూరగాయల బండ్ల ప్రారంభోత్సవం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని కలచట్ల గ్రామంలో కలచట్ల బయో రిసోర్స్ సెంటర్‌తో పాటు సేంద్రియ కూరగాయల బండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి మరియు నంద్యాల జిల్లా కలెక్టర్  రాజ కుమారి గనియా , నాబార్డ్ వాటర్ షెడ్ డీడీఎం కే.అర్.డి.కార్తీక్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మరియు జిల్లా కలెక్టర్  బయో రిసోర్స్ సెంటర్‌ను ప్రారంభించి, సేంద్రియ వ్యవసాయ విధానాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కేంద్రం ద్వారా రైతులు సేంద్రియ ఎరువులు, జీవాణు ఆధారిత ఇన్పుట్లు పొందడంతో పాటు, వ్యవసాయ వ్యయాలు తగ్గి ఆదాయం పెరుగుతుందని తెలిపారు. అలాగే రైతులు పండించిన సేంద్రియ కూరగాయలను నేరుగా వినియోగదారులకు చేరవేయడానికి ఏర్పాటు చేసిన కూరగాయల బండ్లను ప్రారంభించారు.అనంతరం ప్రభుత్వ సబ్సిడీతో అందిస్తున్న ట్రాక్టర్లను అర్హులైన రైతులకు పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు యాంత్రీకరణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి వ్యవసాయ పనులు సులభతరం అవుతాయని అన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వ్యవసాయ రంగాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని వారు స్పష్టం చేశారు.ఈకార్యక్రమంలో తేదేపా సీనియర్ నాయుకులు లక్కసాగరం లక్ష్మి రెడ్డి,ఎద్దుల దొడ్డి ప్రభాకర్ రెడ్డి,సీమా సుధాకర్ రెడ్డి, లక్ష్మి నారాయణ యాదవ్, ఏనుగమర్రి రామకృష్ణ,మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా రేణుక, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణమూర్తి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, ఎంపిడిఓ శ్రీనివాసరావు,బత్తుల రామేష్ రెడ్డి, నాగేంద్ర,గోల్ల రామ్మోహన్ యాదవ్ , ముస్లిం మైనార్టీ నాయకులు ఖాజా ఫీర్,తేదేపా మండల కన్వీనర్ సుదర్శన్,పట్టణ అధ్యక్షుడు కోంగన పల్లే మదు,ప్రిన్స్ పాల్ మదు,నల్లమెకలపల్లె సత్యం  , రాజశేఖర్, పెద్ద పూజర్ల ప్రసాద్ రెడ్డి, సుధాకర్ గుప్తా, అదే బాద్ పరమేష్, ఎంఆర్ఓ భరతి, డిప్యూటీ ఎంపీడీవో ప్రభాకర్,జిల్లా హార్టికల్చర్ అధికారి నాగరాజు,హార్టికల్చర్ అధికారి కళ్యాణి, నాబార్డ్ వాటర్ షెడ్ ఉద్యోగులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author