బాధ్యతాయుతంగా సమస్యలను పరిష్కరించండి
1 min read

ఫిర్యాదులను స్వీకరించిన ఎమ్మెల్యే
మనపై నిందలు వేయడమే వైసీపీ పని..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : మండల అధికారులు బాధ్యతాయుతంగా ప్రజా సమస్యలను పరిష్కరించాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అధికారులను ఆదేశించారు.నంద్యాల జిల్లా మిడుతూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆరవ ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో భాగంగా ప్రజలనుండి 26 వినతులను ఎమ్మెల్యే స్వీకరించారు.సమస్యలను పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంతవరకు నాకు 245 దరఖాస్తులకు గాను 207 దరఖాస్తులను పరిష్కరించామని 2014-19 మధ్యలో కట్టిన ఇండ్లకు రావాల్సిన బిల్లుల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని గతంలో రెవెన్యూ సమస్యలను కలెక్టర్ పరిష్కరించే వారిని కానీ ప్రభుత్వం తహసిల్దారు ఆర్డీవోలకు కొన్ని అధికారాలను ఇవ్వడం జరిగిందన్నారు.
వచ్చే ఎన్నికల్లో మనం సత్తా చాటాలి
రానున్న ఎన్నికల్లో మనం సత్తా చాటాలని ఎమ్మెల్యే కార్యకర్తలకు సూచించారు. గ్రీవెన్స్ అనంతరం ఖాతా రమేష్ రెడ్డి స్వగృహం దగ్గర మండల కన్వీనర్ రమేష్ రెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ వారు మనపై నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారని అందరూ కలిసికట్టుగా ఉండి మనం ప్రజలకు చేస్తున్న మంచి వాటిని గురించి ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ మంగవల్లి,ఎంపీడీవో దశరథరామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులు,ఎస్ఐ ఓబులేష్,డీటీ శాన్వాజ్,క్లస్టర్ ఇన్చార్జీలు వంగాల శివరామిరెడ్డి,కమతం రాజశేఖర్ రెడ్డి,సంపంగి రవీంద్రబాబు,సర్పంచ్ ఎల్లయ్య,మాజీ సర్పంచ్ లు రామస్వామి రెడ్డి,నాగేంద్ర మరియు పంచాయతీ కార్యదర్శులు వీఆర్వోలు అధికారులు పాల్గొన్నారు.

