NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫిబ్రవరి 4 నుండి 6వరకు ఏపీ వర్సెస్ తెలంగాణ అంధుల క్రికెట్ ద్వైపాక్షిక సిరీస్

1 min read

ఆశ్రమం మెడికల్ కాలేజీ క్రికెట్ మైదానంలో కార్యక్రమం

అర్జున్ అవార్డు గ్రహీత ఐ.అజయ్ కుమార్ రెడ్డి

మానసిక శారీరక, దృఢత్వానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: ఏలూరు:క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ మరియు విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ -అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఫిబ్రవరి 4 నుండి 6వరకు ఏలూరులోని ఆశ్రమం మెడికల్ కాలేజ్ క్రికెట్ మైదానంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య “3 టీ20 మ్యాచ్ల అంధుల క్రికెట్ ద్వైపాక్షిక సిరీస్” నిర్వహించనున్నారు.ఈ మేరకు అసోసియేషన్ కార్యదర్శి జి.రవీంద్రబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ టోర్నమెంట్ వివరాలను ఆయన వెల్లడిస్తూ. అంధ క్రీడాకారులలోని ప్రతిభను వెలికితీసేందుకు మరియు వారిని ప్రోత్సహించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ముఖ్య వివరాలు:ప్రారంభోత్సవం : ఫిబ్రవరి 4, 2026 (బుధవారం) ఉదయం 8:30 గంటలకు.ముగింపు వేడుక:వేదిక:ఫిబ్రవరి 6, 2026 (శుక్రవారం) మధ్యాహ్నం 12:00 గంటలకు.ఆశ్రమం మెడికల్ కాలేజ్ క్రికెట్ మైదానం, ఏలూరు.ఈ కార్యక్రమానికి ప్రతేక్య అతిధిగా అర్జున అవార్డు గ్రహీత తన సారధ్యంలో మూడు సార్లు అంధుల ప్రపంచ క్రికెట్ కప్ను పాకిస్థాన్ పై గెలిచి భారతదేశానికి అందించిన భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత ఐ. అజయ్ కుమార్ రెడ్డి  ప్రత్యేక అతిధిగా అయ్యారు. మానసిక శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా పలువురు ప్రముఖులు ప్రత్యేక ఆధితులుగా హాజరయ్యారు. ఈ క్రీడా పోటీలు విజువల్లి చాలెం చేలజ్ల్డ్   ఎంప్లాయిస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా సెక్రటరీ కె.మదన్ ఆధ్వర్య పర్యవేక్షణలో నిర్వహించారు.క్రీడాభిమానులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై అంధులైన క్రీడాకారులను ఉత్సాహపరచాలని కార్యదర్శి జి.రవీంద్రబాబు కోరారు. మదన్ తదితరులు పాల్గొన్నారు.

About Author