NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యంపి నిధుల తో సుమారు రూ 30 లక్షలతో అత్యాధునిక అంబులెన్స్‌

1 min read

జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసుపత్రి అధికారులకు లాంఛనంగా ప్రారంభం

ఇంచార్జ్ మంత్రితో  ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి , ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, ఏపి వడ్డి కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఏపియస్ఆర్టీసీ విజయవాడ- 2 ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు

ఏలూరుజిల్లాప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి శనివారం ఏలూరు యంపి  సౌజన్యంతో ( యంపి నిధులు) సుమారు రూ 30 లక్షలతో  అత్యాధునిక అంబులెన్స్‌ను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్  మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా ప్రధాన ఆసుపత్రి అధికారులకు  లాంఛనంగా అందజేశారు. ఇంచార్జ్ మంత్రితో పాటు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, ఏపి వడ్డి కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఏపియస్ఆర్టీసీ విజయవాడ-2  ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు లు సంయుక్తంగా పాల్గొన్నారు. ఏలూరు పార్లమెంటు సభ్యులు నిధులు నుండి రెండు అంబులెన్స్ మంజూరైనను మొదటి అంబులెన్స్ వాడుకలోకి తేవడానికి ఆలస్యం అవ్వటం పట్ల ఇంచార్జ్ మంత్రి అసహనం చేశారు. అంబులెన్స్ లో లోపల ఉన్న సౌకర్యాలను పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెండవ అంబులెన్స్ ఈనెల చివరినాటికి వాడుకలోకి తీసుకురావాలని అధికారులకు జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆదేశించారు.ఈ సందర్భంగా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ  ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వేగవంతమైన సేవలు అందించడంలో అంబులెన్స్ లు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లను చిరునవ్వుతో పలకరిస్తే సగం జబ్బు నయం అవుతుందని, మిగిలిన సగం జబ్బు మీరిచ్చే వైద్యసేవలుతో తగ్గుతుందని అన్నారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. మందులు కొరత లేకుండా చూడాలని, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు జుత్తుగ నాగరాజు, డిసియం యస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, ఏలూరు ఉడా చైర్మన్ పెద్దిబోయిన వాణిశివ ప్రసాదు, కో -ఆప్షన్ సభ్యులు యస్.యం.ఆర్. పెదబాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పి.జె. అమృతం, డిసిహెచ్ యస్ డా.బి.పాల్ సతీష్ కుమార్, ప్రధాన ప్రభుత్వ హాస్పిటల్ ఇంచార్చి సూపర్డెంటు డా.యం. రవిచంద్ర, తహశీల్దారు కె.గాయత్రి దేవి, ఏపియంయస్ ఐ డిసి ఇఇ ఓ.యస్. వై.రాజబాబు, జిల్లా రెడ్ క్రాసు చైర్మన్ డా.యం.బి.యస్.వి. ప్రసాదు, వైస్ చైర్మన్ జె. సత్యనారాయణ రాజు,ప్రభుత్వ వైద్యాధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

About Author