అక్రమ చికెన్ వ్యర్థాల తరలింపుపై పోలీసుల ఉక్కుపాదం
1 min read

రెండు వాహనాలు సీజ్ చేసి11 మందిని అరెస్ట్ చేసిన పెదపాడు ఎస్ఐ ఆర్.శ్రీనివాస్
ఏలూరుజిల్లా ప్రతినినిద,న్యూస్ నేడు: పెదపాడు:ప్రజారోగ్యాని కి విఘాతం కలిగిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న ముఠా లపై పెదపాడు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. గత రెండు రోజులుగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా రెండు వాహనాలను పట్టుకొని, ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్, నూజివీడు డిఎస్పీ కె వి వి ఎన్ వి ప్రసాద్ ఆదేశాల మేరకు పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ యొక్క ఆధ్వర్యంలో పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిన్న మరియు ఈరోజు నిర్వహించిన తనిఖీల్లో చికెన్ వ్యర్థాలతో నిండిన రెండు వాహనాలు పట్టు బడ్డాయి. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ. చికెన్ వ్యర్థాలను బహిరంగంగా, అక్రమ మార్గాల్లో తరలించడం వల్ల పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన దుర్వాసన రావడమే కాకుండా, ప్రమాదకరమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ప్రజారోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించారు. అంతేకాకుండా, ఇది పర్యావరణ కాలుష్యానికి ప్రధాన కారణమవుతుందని పేర్కొన్నారు.అప్రమత్తంగా ఉండండి: మీ పరిసరాల్లో ఎవరైనా ఇలాంటి అక్రమ వ్యర్థాల రవాణా లేదా నిల్వకు పాల్పడుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి.కఠిన ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, పర్యావరణాన్ని కలుషితం చేసే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, కఠినమైన శిక్షలు తప్పవని హెచ్చరించారు.సహాయం కోసం సంప్రదించండన్నరు.ఏదైనా సమాచారం ఉన్నట్లయితే వెంటనే మీ సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112 కు ఫిర్యాదు చేయవలసిందిగా కోరారు.

