NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫిబ్రవరి 12న జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు

1 min read

ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లకు హెల్పర్లకు సిఐటియు పట్టణ కార్యదర్శి టి.శివరాం పిలుపు

కర్నూలు, న్యూస్​ నేడు:  నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి డ్రైవర్ల జీవితాలతో చెలగాటం ఆడే భారత న్యాయ సంహిత చట్టం సెక్షన్ 106 (1)(2) లను రద్దు చేయాలి,రవాణా రంగ ప్రైవేటీకరణ ఆపాలి, డ్రైవర్లకు రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. డోన్ పట్టణంలోని ప్రైవేటు విద్యాసంస్థలు శ్రీ సుధ,శ్రీ చైతన్య,భాష్యం,శ్రీనివాస,అక్షర,శాంజో, రాధాకృష్ణ తదితర స్కూల్ల దగ్గరకు సిఐటియు నాయకులు వెళ్లి స్కూల్ బస్సు డ్రైవర్లకు హెల్పర్లకు ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మె కరపత్రాలను పంపిణీ చేసి సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కార్యదర్శి డోన్ మోటార్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.శివరాం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక కర్షక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలకు ఇదేకంగా ముఖ్యంగా లేబర్ కోడ్ల రద్దు కొరకు అఖిలభారత ట్రేడ్ యూనియన్లు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపుమేరకు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె జరుగుతున్నదని ఆయన అన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్ల జీవితాలు దుర్భరంగా మారాయని వారికి మంచి ప్యాకేజీ ఇచ్చి ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలన్నారు.వాహనాలపై అధిక చలానాలు విధించే జీవో నెంబర్ 21ని, రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్లను బాధ్యులుగా చేస్తూ ఏడు సంవత్సరాల జైలు శిక్ష పది లక్షల జరిమానా విధించే డ్రైవర్ల మెడకు ఉరితాడు లాంటి న్యాయ సంహిత చట్టం 106-(1)(2) సెక్షన్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.స్కూల్ బస్సు డ్రైవర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని ఫిబ్రవరి 12న జరుగే దేశవ్యాప్త సమ్మెకు సహకరించాలని విద్యా సంస్థల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్ బస్సు వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.మద్దిలేటి,నాయకులు భాస్కర్,శివ,మహేష్,నాగరాజు,ధనుంజయ గౌడు, సుబ్బరాయుడు, వెంకటేశ్వర్లు, రంగస్వామి,ఉదయ్,లక్ష్మణ్ నాయక్,చెన్నప్ప,ప్రసాద్, రవి,భాష,కంబగిరి, మహానంది,ఖాసిం, మాధవ్,రవి,కేశప్ప, గంగాధర్,పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author