సెలవుల్లో పన్ను వసూళ్లు యథాతథం
1 min read

నగరపాలక సంస్థ మేనేజర్ ఎన్.చిన్న రాముడు
కర్నూలు, న్యూస్ నేడు: శనివారం సెలవు రోజుల్లో కూడా పన్ను వసూళ్లను యథావిధిగా కొనసాగుతున్నాయని మేనేజర్ ఎన్.చిన్న రాముడు పేర్కొన్నారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో తాత్కాలిక నగరపాలక కార్యాలయంలో పన్ను వసూళ్ల కేంద్రాన్ని ఆయన పరిశీలించి, అక్కడి ఏర్పాట్లు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పన్ను చెల్లింపులు నగరాభివృద్ధికి కీలకమని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ బకాయిలను చెల్లించాలని కోరారు. సెలవు దినాల్లో కూడా కేంద్రం పనిచేయడం ద్వారా ప్రజలకు సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.

