దేశ సంస్కృతికి దూరం కావడమంటే దేశంపట్ల భక్తిలేక పోవడమే
1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే.
ఘణంగా ముగిసిన తి. తి. దే.ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు, న్యూస్ నేడు: ఈ దేశానికి ఘణకీర్తికి కారణం భారతీయ సంస్కృతేనని, అటువంటి శ్రేష్ఠమైన భారతీయ సంస్కృతికి దూరం కావడమంటే దేశంపట్ల భక్తి లేకపోవడమేనని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా పగిడ్యాల మండలం, యం. ఘణపురం గ్రామంలో వెలసిన శివాలయం నందు జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్బంగా ముక్కోటి దేవతా స్వరూపమైన గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని గురించి వివరించారు. శివాలయం అర్చకులు జె.శివరామకృష్ణయ్య మరియు శ్రీరామాలయం అర్చకులు జె. యం. మల్లిఖార్జున స్వామి భక్తాదులందరితో గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలను వేదక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచార మండలి సభ్యులు అంబటి శివశంకర రెడ్డి, సర్పంచ్ పి.ప్రతాప్ రెడ్డి, బి.ప్రభాకర్ రెడ్డి, బి. విజయభాస్కర్ రెడ్డి, కె.ఎల్లయ్య, జి.చంద్రన్న, కె.వెంకటేశ్వర్లు, జి శివన్న, కె.నాగ మల్లయ్య, బి రాంభూపాల్ రెడ్డి, కె.మల్లయ్య కె చిన్న వెంకటేశ్వర్లు, జి వెంకటస్వామి, సి.వి రాంరెడ్డి, కే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తాదులందరికీ ఆలయ కమిటీ తీర్థ ప్రసాదాలు అందించారు.

