NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏర్పాట్లను పరిశీలించిన దేవదాయ కమిషనర్​

1 min read

శ్రీశైలం, న్యూస్​ నేడు: మహాశివరాత్రి ఏర్పాట్లను ఈ రోజు (14.02.2026) దేవదాయ కమిషనరు శ్రీ కె. రామచంద్రమోహన్ పరిశీలించారు. ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు మొదలైనవాటిని పరిశీలించారు.       ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిశీలనలో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శ్రీ ఎస్.ఎస్. అజాద్ కూడా పాల్గొన్నారు.   ఈ సందర్భంగా కమిషనరువారు మాట్లాడుతూ క్యూలైన్లలో ఎటువంటి తొక్కిసలాట లేకుండా ఉండేందుకుగాను పోలీస్‌శాఖ సమన్వయంతో తగు ఏర్పాట్లు ఉండాలన్నారు. అలాగే తగినస్థాయిలో సెక్యూరిటీ సిబ్బందిని మరియు శివసేవకులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. క్యూకాంప్లెక్స్‌లో నూ నిరంతరం అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు మొదలైనవాటిని అందజేస్తుండాలన్నారు. క్యూలైన్లలో కూడా నిరంతరం మంచినీటిని అందజేస్తుండాలన్నారు.  క్యూలైనులో ఏర్పాటు చేయబడిన   వాటర్ పాయింట్లకు నిరంతరం నీటిసరఫరా ఉండాలన్నారు.క్యూలైన్లలో అవాంఛనీయ సంఘటనలు నిరోధించేందుకు మరియు అత్యవసర సమయాలలో వినియోగించుకునేందుకు క్యూలైన్లలో ఏర్పాటు చేయబడిన అత్యవసర గేట్లు ( ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్లు) సజావుగా పనిచేసేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా క్యూకాంప్లెక్స్‌లోని శౌచాలయాల శుభ్రతపట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. అన్నీ శౌచాలయాలలో కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం నీటిసరఫరా ఏర్పాటు ఉండాలన్నారు.      శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూలైన్లలో కూడా మంచినీరు ఉండాలన్నారు.         ఇంకా కమిషనరు వారు మాట్లాడుతూ భక్తులు అధికసమయం క్యూలైన్లలో వేచివుండకుండా త్వరితంగా ప్రసాదాలను అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.   ముఖ్యంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్నప్రసాదవితరణ జరుగుతుండాలన్నారు.   ఆయావంటకాలన్నీ రుచికరంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు.        అన్నప్రసాదాలను స్వీకరించేందుకు వచ్చిన భక్తులు అధికసమయం వేచివుండకుండా వుండేందుకు తగు చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు. ఇందుకుగాను అన్నదానమందిరంలోని ఆయా భోజనశాలలో తగు ముందస్తు ఏర్పాట్లు ఉండాలన్నారు. అన్నప్రసాద వితరణ సమయములో  సంబంధిత అధికారులు ప్రతి హాలులో కూడా అన్నప్రసాద వితరణ సజావుగా జరిగేటట్లు పర్యవేక్షిస్తుండాలన్నారు. శౌచాలయాలు కూడా ఎప్పటికప్పుడు  శుభ్రం చేస్తుండాలన్నారు.  ముఖ్యంగా సిబ్బంది అందరు కూడా భక్తులతో మర్యాదగా మెలగాలన్నారు.  భక్తులు అడిగిన సమాచారాన్ని శివసేవకులు, సిబ్బంది ఓపికగా అందిస్తుండాలన్నారు.   ఆలయ సమాచార వ్యవస్థద్వారా నిరంతరం భక్తులకు సమాచారాన్ని తెలియజేస్తుండాలన్నారు.

About Author