NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బియ్యం బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్న హెచ్ఎం ను సస్పెండ్ చేయాలి

1 min read

ఆర్ ఏ వి ఎఫ్, ఆర్ యు ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘాలు

కౌతాళం న్యూస్ నేడు: మండల కేంద్రంమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న హెచ్ఎం ను సస్పెండ్ చేయాలని రాయలసీమ అభ్యుదయ విద్యార్థి ఫెడరేషన్, రాయలసీమ యునైటెడ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హైస్కూల్ నందు ధర్నా నిర్వహించి అనంతరం ఎంఈఓ శోభ రాణి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థు సంఘం నాయకులు కృష్ణ ,ఖాజా ,రఘునాథ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టడం జరిగిందని దీన్ని ఆసరాగా తీసుకుని శివరాత్రి సందర్భంగా సెలవు దినాల్లో బియ్యంను ప్రైవేట్ వ్యక్తుల ద్వారా బ్లాక్ మార్కెట్లో  అమ్మడం దుర్మార్గమని అన్నారు. స్థానిక హెచ్ఎం ను విద్యార్థి సంఘాలు విలేకరులు ప్రశ్నించగా మమ్మల్ని అడగడానికి మీరు ఎవరు అని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన జీవోను అడ్డం పెట్టుకొని సమాజం కోసం పనిచేసే వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు సబాబు అని వారు ప్రశ్నించారు. కాబట్టి ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలో చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులకు తదితరులు పాల్గొన్నారు.

About Author