విద్యార్థుల నోటి దగ్గర కూడును దోచుకుంటున్న ప్రధాన ఉపాధ్యాయుడు
1 min read

పాఠశాల బియ్యం అక్రమంగా తరలించిన ప్రధాన ఉపాధ్యాయుడును సస్పెండ్ చేయాలి.
ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు యస్.ఈరేష్ డిమాండ్
కౌతాళం, న్యూస్ నేడు : మంగళవారం మండల కేంద్రమైన అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుడి పై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వో, కార్యాలయం నందు ఆందోళన నిర్వహించి ఆర్ఐ తిక్క స్వామి,ఎంఈఓ వినతిపత్రం అందజేశారు.. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు సాయి వర్మ,హనుమేష్,స్వామి,గోవిందు,భీమయ్య, ఐనూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు యస్.ఈరేష్ మాట్లాడుతూ ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద పేద,బడుగు వెనుకబడిన వర్గాల పిల్లలకు పోషకాహారం అందించేందుకు కేటాయించిన రేషన్ బియ్యాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అక్రమంగా తరలించి, వ్యక్తిగత లాభం కోసం దుర్వినియోగం చేస్తున్నారు.అక్రమంగా తరలించిన బియ్యం మొత్తాన్ని గుర్తించి, ఆర్థిక నష్టాన్ని వసూలు చేయాలి.విద్యాశాఖ, సివిల్ సప్లైస్, విజిలెన్స్ శాఖలతో సంయుక్తంగా స్వతంత్ర విచారణ నిర్వహించాలి.భవిష్యత్తులో ఇలాంటి అవకతవకలు జరగకుండా బియ్యం సరఫరా, నిల్వ, వినియోగంపై కఠిన మానిటరింగ్ ఏర్పాటు చేయాలి డిమాండ్ చేశారు.
స్పందించిన ఎమ్మార్వో,ఎంఈఓ
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై ఎంక్వయిరీ నిర్వహించి వాస్తవాలు తెలుసుకొని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారుచర్యలు తీసుకో లేని పక్షంలో పెద్ద ఎత్తున అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

