జిల్లా స్థాయి శావ్ లీగ్స్ చెస్ పోటీలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, విజయవాడ వారి ఆదేశాల మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, కర్నూలు వారు 17-02-2026 తేదిన జిల్లా స్థాయి శాప్ చెస్ లీగ్స్ అండర్- 13, 15, 17 మరియు 19 వయస్సు విభాగాలలో బాలురు మరియు బాలికలకు చెస్ పోటీలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆవుట్ డోర్ స్టేడియం, నందు నిర్వహించడమైనది. ఈ జిల్లా స్థాయి శాప్ లీగ్స్ చెస్ పోటీలలో 150 మంది బాలురు మరియు బాలికలు పాల్గొన్నారు.ఇందులో గెలుపొందిన క్రీడాకారులను ఈ నెల 21వ మరియు 22వ తేదిలలో తిరుపతిలో జరగబోయే రాష్ట్ర స్థాయి శాప్ చెస్ లీగ్స్ పోటీలకు పంపడం జరుగుతుంది.జిల్లా స్థాయి శాప్ లీగ్స్ చెస్ పోటీలలో గెలు పొందిన క్రీడాకారులు పట్టిక జతపరచడమైనది.ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా శ్రీ పి.విశ్వనాథ్ , కమీషనర్, కర్నూలు నగర పాలక సంస్థ. కర్నూలు, శ్రీ బి. భూపతి రావు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి, కర్నూలు, శ్రీ టి. క్రీష్ణ , కార్యదర్శి, కర్నూలు యస్.జి.యఫ్, క్రీ యస్. ఇమామ్ హుస్సేన్ , జాతీయ స్థాయి ఆర్బిటర్, శిక్షకులు, సిబ్బంది మరియు పత్రిక విలేకరులు పాల్గోన్నారు.

