కేటీఆర్ సహాయం కోరిన రష్మి !
1 min readపల్లెవెలుగు వెబ్ : బుల్లితెర యాంకర్ రష్మి తెలంగాణ మంత్రి కేటీఆర్ సహాయం కోరింది. జీహెచ్ఎంసీ పరిధిలోని కుక్కలకు యానిమల్ బర్త్ ఆపరేషన్ చేసి అలాగే వదిలేస్తున్నారని, దీనికి సంబంధించి ఏదైన పరిష్కార చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ను కోరింది. ట్విట్టర్ ద్వార కేటీఆర్ వ్యక్తిగత ఖాతకు, కార్యాలయ ఖాతాకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. బుల్లి తెర యాంకర్ గా రాణిస్తున్న రష్మి .. జంతు పరిరక్షణ కోసం పనిచేస్తుంది. వివిధ అవగాహన కార్యక్రమాలలో పాల్గొంటూ జంతు పరిరక్షణ పై అవగాహన కల్పిస్తోంది.