రాష్ట్రప్రభుత్వ సహకారంతో ‘‘ ఆర్యూ ’’అభివృద్ధికి శక్తిమేరకు కృషి చేస్తున్న
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్రప్రభుత్వ సహకారంతో గత సంవత్సరకాలంలో రాయలసీమయూనివర్సిటీ అభివృద్ధికి శక్తిమేరకు కృషిచేస్తున్నట్లు వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వి. వెంకటబసవరావు తెలిపారు. ఆచార్య బసవరావు వి.సిగా బాధ్యతలు చేపట్టి తొలిసంవత్సరం పూర్తైన సందర్భంగా వి.సి. కాన్ఫరెన్సుహాలులో నిర్వహించిన సభలో ఆయనకు వర్సిటీ వర్గాలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపినవారందరికీ ఆచార్య బసవరావు ధన్యవాదాలు తెలిపారు. వర్సిటీలోని అందరినీ సమన్వయం చేసుకుంటూ వివిధ కార్యక్రమాలను చేపట్టినట్లు ఆయన తెలిపారు. వాటిద్వారా జరిగిన ఏ మంచి అయనా అందరి సహకారంతోటే సాధ్యమైందన్నారు. వర్సిటీ నాల్గవ కాన్వకేషన్ విజయవంతమంవడంలో వర్సిటీలోని ప్రతి ఒక్కరూ కష్టపడటంతోనే సాధ్యమైందన్నారు. ఇదే రకమైన సహకారాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాగుతుందన్న ఆశాభావాన్ని ఆచార్య బసవరావు వ్యక్తంచేశారు.అన్ని రంగాల్లో రాయలసీమ యూనివర్సిటీని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నడుపుతున్న వి.సి. ఆచార్య బసవరావుకు వర్సటీ రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సమర్ధవంతమైన నాయకత్వంలో వర్సిటీలో నెలకొన్న ఒక్కొక్కసమస్యను పరిష్కరిస్తూ వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంతో సమన్వయంచేసుకుంటూ వర్సిటీ పురోగతికి ఆచార్య బసవరావు ఎనలేని సేవలు చేస్తున్నారని ఆచార్య నాయక్ కొనియాడారు.ఈ సందర్భంగా ప్రసంగించిన వర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి గత సంవత్సరకాలంగా ఎంతో అభివృద్ధి జరిగిందని, అది మరింతగా ముందుకు సాగాల్సిన అవసరముందన్నారు.ఈ సందర్భంగా వర్సిటీ వర్గాలు ఆచార్య బసవరావును భారీమాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీలోని వివిధ విభాగాల ఆచార్యులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని ఆచార్య బసవరావుకి శుభాకాంక్షలు తెలియజేశారు.

