NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్పీడ్ బ్రేకర్ కు పేంటింగ్ వేసిన ఎస్డీపిఐ  నాయకులు

1 min read

హోలగుంద న్యూస్ నేడు: స్థానిక  హొళగుంద తేరు బజార్ నందు సి సి రోడ్ వేయడం జరిగింది రోడ్ లో స్పీడ్ బ్రేకర్ కనిపించక పొవడం తో ప్రజలు చాలా ఇబ్బందులు పడడం చూసి ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపిఐ ) నాయకులు సి సి రోడ్‌లో ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్‌కు పెయింటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ స్పష్టంగా కనిపించకపోవడంతో కొంత మంది బైక్ నుంచి  పడిపోవడం జరిగింది అంతే అక్కడే  స్కూల్ ఉండడంతో పిల్లలు కూడా ఎక్కువగా తిరుగుతుంటారు అలాగే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు సంభవించే అవకాశముందని గమనించి ఎస్డీపిఐ నాయకులు మరియు కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్పీడ్ బ్రేకర్‌కు ఎరుపు మరియు పసుపు రంగులతో పెయింటింగ్ చేసి, అది దూరం నుంచే స్పష్టంగా కనిపించేలా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యమని నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్డీపిఐ అసెంబ్లీ ఉపాధ్యక్షులు కె. సలాం   మాట్లాడుతూ, “ప్రజల సమస్యలు మా సమస్యలే. స్థానిక సమస్యలను పరిష్కరించడంలో ఎస్డీపిఐ ఎప్పుడూ ముందుంటుంది” అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఉపఅధ్యక్షులు సలాం, కార్యదర్శి హఫీజ్,  బ్రాంచ్ నాయకుల రహమతుల్లా, ఇర్ఫాన్,హరూన్,సిక్బాత్, ఆయ్యుబ్ తదితరులు పాల్గొన్నారు.

About Author