NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సైబర్ … ట్రాఫిక్ భద్రతపై జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారి ఆదేశాల మేరకు జిల్లాలో మహిళలు, బాలల రక్షణ, సైబర్ నేరాల నివారణ, ట్రాఫిక్ భద్రత మరియు పోలీస్ సేవల పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోలీసు అధికారులు  విస్తృత స్థాయిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా  పాఠశాలలు మరియు పట్టణాలు,  గ్రామాలను సందర్శించి   సీఐలు, ఎస్సైలు,   జీఎంఎస్కేలు కలిసి వివిధ అవగాహన సమావేశాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాలలో ప్రధానంగా మహిళలపై నేరాలు , బాల్య వివాహాల నిరోధం, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై అవగాహన,  ఈవ్ టీజింగ్ పై నియంత్రణ,  సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ట్రాఫిక్ నిబంధనలు ,  పోలీస్ సేవల గురించి సూచించారు. ఏవైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.శక్తి యాప్ , అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన  డయల్  112 , డయల్  100  , 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్  గురించి వివరించారు.

About Author