అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిరం లో అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా తెలుగు భాషా దినోత్సవం గురించి వాసు ప్రసంగిస్తు తెలుగు భాషా తల్లి భాష అని తెలియజేసారు. ఈ భాషకు ప్రపంచంలో 16వ స్థానం లభించింది. జాతీయ స్థాయిలో మన భాషకు 3వ స్థానం ఉంది. జాతీయ స్థాయిలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది.గిడుగు రామమూర్తి తెలుగు భాష లిపి కనుగొన్నారు. శ్రీ కృష్ణ దేవరాయలు వారు దేశ భాష లందు తెలుగు లెస్స అని తెలియజేసారు. చిన్నారులు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు పద్యాలు చెప్పారు. చివరికి “మా తెలుగు తల్లికి మల్లె పూదండ”.గేయం ఆలపించారు.ఈ కార్యక్రమం లో భాగంగా పాఠశాలలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. పాఠశాల పరిసరాలు శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఆచార్యులు పిల్లలు పాల్గొన్నారు.

