బస్టాండ్‌లో వాహనాల పార్కింగ్‌కు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే కోట్ల
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి బస్టాండ్‌లో పార్కింగ్ సౌకర్యాల అభివృద్ధి మరియు భద్రతా ఏర్పాట్లపై డిపో మేనేజర్‌తో డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సమగ్రంగా చర్చించారు.ఈసందర్భంగా శనివారం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆర్టీసీ బస్టాండ్ సందర్శించి ఆయన మాట్లాడుతూ బస్టాండ్‌లో వాహనాల పార్కింగ్‌కు తగిన స్థలం కేటాయింపు, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరంపై అధికారులకు సూచనలు ఇచ్చారు.అదేవిధంగా, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపర్చాలని ఆదేశించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల ఇన్చార్జి ఎద్దుల దొడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎస్ఐ నాగార్జున,తెదేపా సీనియర్ నాయకులు లక్ష్మీ నారాయణ యాదవ్, మాజీ ఎంపీపీ టి.శ్రీనివాసులు, ముస్లిం మైనార్టీ నాయకులు ఖాజా ఫీర్, తేదేపా పట్టణ అధ్యక్షుడు కొంగనపల్లి మధు, మండల అధ్యక్షులు మెట్టు పల్లె సుదర్శన్,ప్రిన్సిపాల్ మధు, ఎస్ కే వలి, వెంకటేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


