టి.జి దంపతులకు ఘన సన్మానం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు : రాజ్యసభ మాజీ సభ్యుడు టి.జి. వెంకటేష్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన స్వగృహంలో టి.జి వెంకటేష్, ఆయన సతీమణి రాజ్య లక్ష్మీని బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టిజి దంపతులకు శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించి.. వేద మంత్రోచ్ఛరణాలతో ఆశీర్వదించారు. కార్యక్రమంలో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సండేల్ చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షుడు చెరువు వెంకట దుర్గాప్రసాద్ ఉపాధ్యక్షుడు కంచు గంటల శ్యామసుందర్ రావు, గౌరవ సలహాదారు టివి రవిచంద్ర శర్మ మరియు పురోహితులు మామిళ్ళపల్లి రాజేష్ గారి వేద పండిత బృందం దేవాలయం పూజారులు ప్రసన్నకుమార్ స్వామి ,నిఖిల్ గురురాజా తదితరులు పాల్గొన్నారు.

