ప్రభుత్వ పథకాల గురించి సమర్థవంతంగా ప్రచారం చేయాలి
1 min read

జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి
కర్నూలు, న్యూస్ నేడు: ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కలిగేలా సమర్థవంతంగా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు.సమాచార శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన స్వర్ణాంధ్ర@2047 క్యాలెండర్ ను శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జిడిడిపి, తలసరి ఆదాయం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు ఆయా శాఖల అధికారులు ప్రణాళికా బద్ధంగా పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై ప్రజల నుండి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చేలా అధికారులు పని చేయాలని సూచించారు. ఆయా శాఖల కు సంబంధించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ గ్రేడ్ పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..వ్యవసాయం, పశు సంవర్థకం, డ్రిప్ ఇరిగేషన్ తదితర రంగాల్లో రైతుల తలసరి ఆదాయం పెరిగేలా బలోపేతమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, డీఆర్డీఏ పిడి రమణారెడ్డి, సమాచార శాఖ ఉప సంచాలకులు జయమ్మ, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.

