జనసేనలో చేరిన శాలివాహన సంఘం నాయకులు
1 min read

వారికి జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన జనసేన ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ చింత సురేష్ బాబు
కర్నూలు , న్యూస్ నేడు: జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుమ్మర/శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పీవీబీ సుబ్బయ్య ఆధ్వర్యంలో కర్నూలు శాలివాహన సంఘం నగర అధ్యక్షులు కె వి మధు శాలివాహన కమిటీ సభ్యులు కేసి నాగన్న,సంజీవయ్య,తిరుపతయ్య,కె.వి అశోక్ దాదాపు 100 మంది యువకులు మహిళలు పార్టీలో చేరి సభ్యత్వ తీసుకోవడం జరిగింది. వారికి జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ చింత సురేష్ బాబు జనసేన కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ సామాన్యులకు మధ్యతరగతి వారికి సభ్యత్వం ద్వారా భద్రత కల్పించే ఏకైక పార్టీ జనసేన పార్టీ అని తెలిపారు. జనసేన పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ ఈరోజు అధికారంలో కీలక పాత్ర పోషిస్తున్నారని రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నదని అన్నారు, కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగ నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ.ప్ర రాష్ట్ర వాల్మీకి/బోయ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ తోళ్ళ మంజునాద్ పాణ్యం నియోజకవర్గ నాయకులు వై. బజారి,కే. షబ్బీర్ ,బి. సుధాకర్ ,హుస్సేన్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

