NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యమ స్ఫూర్తితో జనసేన సభ్యత్వం ఉద్యమం లా నమోదు చేయాలి

1 min read

సభ్యత్వం నమోదు కార్యకర్తల కు భద్రత

కర్నూల్ జనసేన పార్లమెంట్ ఇంచార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి,

మంత్రాలయం జనసేన పార్టీ ఇన్చార్జి వాల్మీకి బి లక్ష్మన్న

మంత్రాలయం న్యూస్ నేడు :  ఉద్యమ స్పూర్తి తో జనసేన సభ్యత్వం నమోదు ఉద్యమం లా కొనసాగాలని కర్నూలు జనసేన పార్లమెంటు ఇన్చార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి, మంత్రాలయం జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న పిలుపునిచ్చారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో  రాగ సుధా ఫంక్షన్ హాల్ లో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా  జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కర్నూలు పార్లమెంట్ ఇన్చార్జి చిలక మధుసూదన్ రెడ్డి  హాజరైనారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  నాయకత్వంలో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో  బలంబృతమైందని, అందరూ ఆయన ఆదేశాలను  తప్పనిసరిగా పాటిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ఒక ఉద్యమంలా చేయాలని కోరారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు మీ జీవితాలకు వెలుగు నింపుతుందని, జనసేన  రాజకీయ పార్టీలో మీకు ప్రత్యేకమైన గుర్తింపునిస్తుందని తెలిపారు.ఈ సమావేశంలో తోవి తిక్కయ్య, ఈరప్ప,  ఎర్రి స్వామి, బాపురం  చెన్నారెడ్డి, కంసాలి విశ్వనాధ్, బి రాఘవేంద్ర, వరప్రసాద్, మంత్రాలయం మండలం నాయకులు లోకేష్, మరియు జనసేన నాయకులు, 250 పైగా కార్యకర్తలు మరియు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author