వాహనాలను దొంగలించే వారికి నేరాలకు పాల్పడే వారు తస్మాత్ జాగ్రత్త..
1 min read

కర్నూలు ఎస్పీ
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు పట్టణంలోని ప్రధాన రహదారులు , ట్రాఫిక్ కూడళ్లు , మరియు ముఖ్య మైన రద్దీ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ఆధునిక మ్యాట్రిక్స్ మరియు AI సీసీ కెమెరాలు 24 గంటలపాటు నిఘా పర్యవేక్షణ కొనసాగుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని , ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే ( ఆటోలు , భారీ వాహనాలు , టూ వీలర్స్ , ఇతర అన్ని రకాల వాహనాలు) వాహనాలను ఆధునిక మ్యాట్రిక్స్ మరియు A I సిసి కెమెరాల ద్వారా గుర్తించి, ఆటోమేటిక్ విధానంలో ఈ-చలాన్ ల జరిమానాలు విధిస్తామన్నారు. నిబంధనలు పాటించని వారి పై చట్ట పరమైన చర్యలు తప్పవని , ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరూ పాటించి పోలీసు శాఖకు సహకరించాలని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ విజ్ఞప్తి చేశారు.

