NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మోహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ నిధులు రూ.9.20 లక్షలతో 141 కుట్టు మిషన్ల పంపిణీ

1 min read

మోహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షులు  మొహమ్మద్ ఇబ్రహీం

కర్నూలు, న్యూస్​ నేడు:  మైనారిటీ ముస్లిం మహిళల సాధికారతను ప్రోత్సహించేందుకు కుట్టు మిషన్ ట్రైనింగ్ పూర్తి చేసి సర్టిఫికెట్లు పొందిన 141 మంది మహిళలకు కుట్టు మిషన్లను  మోహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ నిధులు రూ.9.20 లక్షలతో పంపిణీ చేయడం జరిగిందని మోహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షులు  మొహమ్మద్ ఇబ్రహీం  బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ శ్రీ అబ్దుల్ అజీజ్  ఆదేశాల మేరకు మోహామ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ నిధుల నుండి 141 కుట్టుమిషన్లను కొనుగోలు చేసి  రాష్ట్ర  లా మరియు మైనారిటీ వ్యవహారాల మంత్రి  ఎన్.ఎం.డి. ఫరూఖ్, రాష్ట్ర ఇండస్ట్రీస్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి  టి.జి. భరత్ చేతుల మీదుగా పేద ముస్లిం మహిళలకు పంపిణీ చేశామని ఆయన వివరించారు.

About Author