నవ దంపతులకు ‘కుటుంబ సంక్షేమం ఆరోగ్యం’ పై అవగాహన
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి పి. విజయ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళ దినోత్సవం లో భాగంగా 10 వ రోజు కార్యక్రమం అంశం ‘కుటుంబ సంక్షేమం అవగాహనా ఆరోగ్యం’ పై నవ దంపతులకు అవగాహనానను కల్పించారు. బుధవార పేట 4 మరియు 12 సెంటర్ చెట్టుకింద బడిలో కార్యక్రమం ఏర్పాటు చేసారు.పాలిచ్చే తల్లులు, కొత్తగా వివాహం చేసుకున్నవారు ఆరోగ్య పై ఎలాంటి జాగ్రత్త లు తీసుకోవాలి, ఈ సమయం లో ఈ మాత్రలు తీసుకోవాలి అనే దానిపై అవగాహనా కల్పించారు. అలాగే వారికీ కొన్ని క్విజ్ రూపం లో ప్రశ్నలు అడిగి వారికీ మొదటి బహుమతి, రెండవ బహుమతి మొక్కలను అందజేశారు. కార్యక్రమం లో ఈఓ రాజేశ్వరి, వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ పి. మేరీ స్వర్ణలత, జోష్నా ప్రియాంక, డిఎల్ ఎస్ ఏ మెంబెర్ రాయపాటి శ్రీనివాసులు సచివాలయం నర్సూ. అరుణ, అంగన్వాడీ వర్కర్స్ లక్ష్మి దేవి, రాజేశ్వరమ్మలు పాల్గొన్నారు.

