పెదపాడు పోలీసుల మానవీయత
1 min read

దారి తప్పిన మహిళను క్షేమంగా కుటుంబానికి అప్పగించిన పెదపాడు ఎస్.ఐ ఆర్.శ్రీనివాస్
కృతజ్ఞతలు తెలియజేసిన తల్లిదండ్రులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: శాంతిభద్రతల పరి రక్షణతో పాటు సామాజిక బాధ్యత లోనూ తాము ముందుంటామని పెదపాడు పోలీసులు మరోసారి నిరూపిం చారు.మతిస్థిమితం లేక దారి తప్పి తిరుగు తున్న ఒక మహిళను గుర్తించి, చాకచక్యంగా ఆమె వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు పెదపాడు ఎస్ఐ ఆర్.శ్రీనివాస్ అప్పగి oచ్చారు. తణుకు పట్టణానికి చెందిన ఈదర రత్న కుమారి 50 అనే మహిళ మతిస్థిమితం సరిగా లేకపోవడంతో దారి తప్పి ఏలూరు జిల్లా కలపర్రు టోల్ గేట్ సమీపంలో ఒంటరిగా తిరుగుతున్నారు. గమ నించిన స్థానికులు పెదపాడు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందిన వెంటనే పెదపాడు ఎస్.ఐ శ్రీ ఆర్. శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు.ఆందోళనలో ఉన్న రత్నకుమారి కి ధైర్యం చెప్పి, ఆప్యా యంగా వివరాలు అడిగి తెలుసు కున్నారు.ఆమె ఇచ్చిన అరకొర సమాచారంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఆమె తణుకు నివాసి అని గుర్తించారు. వెంటనే ఆమె కుమార్తె మరియు అల్లుడికి సమాచారం అందించారు.పోలీసుల సమాచారంతో పెదపాడు స్టేషన్ కు చేరుకున్న రత్నకుమారి కుటుంబ సభ్యులు, ఆమెను చూడగానే భావో ద్వేగానికి లోనయ్యారు. ఎక్కడో తణుకులో తప్పిపోయిన తమ మనిషిని, సుదూరంగా ఉన్న కలపర్రు వద్ద గుర్తించి, ఎటువంటి అపాయం కలగకుండా కాపాడిన ఎస్.ఐ శ్రీనివాస్ కి మరియు సిబ్బందికి వారు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు.

