NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా వైఎస్ఆర్‌సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

1 min read

మహానేత వైఎస్ఆర్ ఆశయాల సాధనకే వైఎస్ఆర్‌సీపీ పుట్టింది – ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి

ఆలూరు న్యూస్ నేడు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆలూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. కార్యకర్తలు నినాదాలు చేస్తూ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి మాట్లాడుతూ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగించాలనే సంకల్పంతో 2011 మార్చి 12న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రారంభమైన ఈ పార్టీ నేడు ప్రజల ఆశీర్వాదంతో విజయవంతంగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని అన్నారు.భవిష్యత్తులో కూడా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు సహా ప్రతి వర్గం ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

About Author