NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పది పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం … మండల విద్యాధికారులు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈఓలు వెంకటేశ్వర నాయక్, మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఉత్తమ ఫలితాల సాధన చర్యకు ఉత్తీర్ణత శాతం పెంచేందుకు 100 రోజుల ప్రణాళిక చాలా బాగా ఉపయోగపడిందని  విద్యార్థులు పేర్కొన్నారు. విద్యార్థులు ఎలా చదవాలో పరీక్షలు ఎలా రాయాలో  ఇప్పటికే క్షేత్రస్థాయిలో మండల విద్యాధికారులు,ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు దిశా నిర్దేశం చేశారు. ఈ పరీక్షలకు మండలం నందు ఐదు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది . బాలుర ఉన్నత పాఠశాల సెంటర్ నందు 183 మంది విద్యార్థులు, బాలికల ఉన్నత పాఠశాల సెంటర్ నందు 219 మంది విద్యార్థులు, పోతిదొడ్డి సెంటర్ నందు 72 మంది విద్యార్థులు,జలదుర్గం ఉన్నత పాఠశాల సెంటర్ నందు 238 మంది విద్యార్థులు, రాచర్ల ఉన్నత పాఠశాల సెంటర్ నందు 111 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు.ఈ సంవత్సరం మొత్తం ఎనిమిది వందల ఇరవై మంది రెగ్యులర్ విద్యార్థులు ముగ్గురు వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు. ఈ పరీక్షలు 16వ తేదీ నుండి మొదలై ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు జరుగుతాయి. అదేవిధంగా పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తూ 144 సెక్షన్ అమలులో ఉంటుంది ప్రతి సెంటర్కు తాగునీరు, విద్యుత్తు మరియు వైద్య సదుపాయాలు ఉండేలా చర్యలు చేపట్టడం జరిగిందని వారు తెలిపారు.

About Author