పండుగ వాతావరణంలా పాఠశాల వార్షికోత్సవం
1 min read

అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు..
న్యూస్ నేడు మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కలమందలపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం జరిగిన పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాలు పాఠశాల హెచ్ఎం ఎం రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ పాఠశాల ప్రాంగణమంతా రంగులు,ముగ్గులు,జెండాలు కట్టడంతో పాఠశాలను ప్రత్యేకంగా అలంకరించడంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిడుతూరు మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జున నాయక్ హాజరయ్యారు.ఉదయం పాఠశాలలో విద్యార్థులతో కలిసి సరస్వతి పూజ నిర్వహించారు.మధ్యాహ్నం జరిగిన పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ టీచర్లు చెప్పిన విధంగా విద్యార్థులు చక్కగా చదువుకుంటే వారి జీవితాలు ధన్యం అవుతాయని మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.పాఠశాలకు తల్లిదండ్రుల సహకారం మరువలేనిదని హెచ్ఎం రమేష్ కుమార్ అన్నారు. చదువులో మంచి ప్రతిభ కనబరచిన విద్యార్థులకు నీ మెమెంటోలను అందజేశారు. విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తి పాటలకు ప్రత్యేకంగా డ్రస్సులతో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి.విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా వీటిలో సంతోషంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ డి సైసావలీ, ఎంపీపీఎస్ హెచ్ఎం మహబూబ్ బాష,గ్రామ పెద్దలు పర్వత రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి,ఎల్లనాగన్న, మహేశ్వర్ రెడ్డి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.


