పైపాలెం’లో భగ్గుమన్న వర్గ విభేధాలు
1 min read

ఒకరికి గాయాలు.. నలుగురిపై కేసు నమోదు
న్యూస్ నేడు మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పైపాలెం గ్రామంలో అధికార పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి.నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు శుక్రవారం సాయంత్రం పోలీసులు తెలిపారు.గ్రామంలో ఎంపీ,ఎమ్మెల్యే వర్గీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.సోలార్ వాళ్ళు గ్రామ సమీపంలో కంచెలు ఏర్పాటు చేయడం వల్ల పశువులు,జీవాలను మేపుటకు పొలం వదలలేదని మా గ్రామానికి పొలం వదలాలని ఎంపీ వర్గీయుడు నాగేశ్వరరావు తహసిల్దార్ శ్రీనివాసులును కోరారు.తహసిల్దార్ గురువారం సా 6 గంటల సమయంలో గ్రామంలో సోలార్ పనులను పరిశీలిస్తుండగా ఎంపీ వర్గీయుడు నాగేశ్వరరావు మరియు ఎమ్మెల్యే వర్గీయులు మాట మాట పెరగడంతో నాగేశ్వరరావుకు గాయాలయ్యాయి.తహసిల్దార్ ఎదుటే ఇరు వర్గాల వారు బాహా బాహీకి దిగారు.విషయం తెలుసుకున్న రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ముచ్చుమర్రి ఎస్సై నరేంద్ర గ్రామానికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.మరో వర్గానికి చెందిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

