ప్రజల దాహార్తిని తీర్చేందుకు 250 కోట్ల రూ. బృహత్తర ప్రాణాళిక
1 min read

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళనున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
ప్రజ సమస్యల వినతులు స్వీకరించి సత్వర చర్యలకు అధికారులకు ఆదేశాలు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దెందులూరు ప్రజల దాహార్తిని తీర్చటం కోసం రూ.250 కోట్ల రూపాయలతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో బృహత్తర ప్రణాళిక – ఈనెల 18వ తేదీన జరగనున్న సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి , నిధులు మంజూరుకు కృషి చేస్తానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హామీ ఇచ్చారు.పెదవేగి మండలం దుగ్గిరాల లోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం పలువురు నియోజకవర్గ కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచాలను, పలు ఆహ్వాన పత్రికలను అందజేశారు.ఈనెల 18వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కొలుసు పార్థసారధి సహా జిల్లాలోని సహచర శాసనసభ్యులతో కలిసి జరగనున్న ప్రత్యేక సమావేశంలో దెందులూరు, పెదపాడు, ఏలూరు రూరల్ మండల ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.250 కోట్ల రూపాయలతో పోలవరం రైట్ మెన్ కెనాల్ నుంచి ప్రతి ఇంటికి కూడా సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు చర్యలు చేపట్టేలా ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.

