ఘనంగా పొట్టి శ్రీ రాములు 125వ జయంతి వేడుకలు
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: పొట్టి శ్రీ రాములు 125వ జయంతి వేడుకలు శ్రీ సరస్వతి శిశు మందిరం లో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రధానాచార్యులు కె. పార్వతి చిత్ర పటానికి మాల వేసి పూజ గావించిరి. వాసు తన ప్రసంగంలో భాగంగా ఆయన జీవిత చరిత్ర గురించి వివరించారు. పొట్టి శ్రీరాములు 1901వ సంవత్సరం లో జన్మించారని, మహాత్మ గాంధీ స్థాపించిన సత్య గ్రహం ఆదర్శంగా తీస్కొని స్వాత్రంత్ర సమరంలో పాల్గొన్నారు. ఈయన వైశ్య కులం లో జన్మించిన కానీ హరిజనోర్ధనా కోసం మరియు అన్నీ కులాల పేద వారి కోసం కృషి చేసారని తెలిపారు. ఈయన ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులు నిరసన దీక్ష పాల్గొని ప్రాణాలు అర్పించిరి. ఆంధ్రుల కోసం పోరాటం చేసి అమరజీవి గా కీర్తి పొందారు. ఈ కార్యక్రమం లో ఆచార్యులు, పిల్లలు పాల్గొన్నారు.

