ఉపవాసంతో పేదవారి ఆకలి తీర్చే ఆలోచన కలుగుతుంది
1 min read

ఎస్ఐఓ అధ్యక్షుడు సాజిద్ఉల్లా
శ్రీ సూర్య పబ్లిక్ స్కూల్ లో రంజాన్ నెల విశిష్టత కార్యక్రమం
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మానవులందరికీ దేవుడు ఒక్కడే అని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఓ) ఏలూరు నగర అధ్యక్షులు మొహమ్మద్ సాజిద్ఉల్లా అన్నారు. రంజాన్ నెల ఉపవాసాలు పురస్కరించుకొని నేడు ఏలూరు తంగేళ్లముడి సూర్య పబ్లిక్ స్కూల్ లో రంజాన్ నెల విశిష్ట తెలిపే కార్యక్రమం ఎస్ఐఓ నిర్వహించింది. ఈ సందర్భంగా సాజిద్ ఉల్లా ప్రసంగిస్తూ రంజాన్ నెల ఖురాన్ అవతరించిన నెల అని దానికి కృతజ్ఞతగా 30 రోజులు ఉపవాసాలు మనందరి దైవం విధించాడని వారి ఆదేశాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసాలు ఉంటారని పేర్కొన్నారు. నేడు సైన్స్ పరిశోధనలో ద్వారా ఉపవాసాలు ఉండడం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా నివారిస్తుందని తేల్చిందన్నారు.దీనితోపాటు ఉపవాసాలు ఉండటంతో ఆకలి బాధ తెలిసి పేదవారు అనుభవిస్తున్న ఆకలి బాధలను తీర్చే ఆలోచన మనలో కలుగుతుందన్నారు. మరో వక్త జమతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) కార్యకర్త షేక్.ఇలియాజ్ మాట్లాడుతూ అల్లాహ్ (దైవం) ఈ నెలలో ప్రతి మనిషి తన సంపాదనలొ మిగులు ఉన్న సంపాదనపై 2.5% జకాత్ తీసే పేదవారికి పంచాలని ఆదేశించారని తెలిపారు.మిగులు సంపాదన లేకపోతే రెండున్నర కేజీల బియ్యం లేదా గోధుమలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది లేకించే పేదవారికి పంచాలని అన్నారు. ఇస్లాం ధర్మం ఖురాన్ ద్వారా తల్లిదండ్రులను సేవించడం, ఉపాధ్యాయులను గౌరవించడం,పరమత సహనం, పొరుగు వారి హక్కులు నెరవేర్చాలని ఆదేశాలు ఇస్తుందన్నారు. సూర్య స్కూల్లో చదువుతున్న విద్యార్థులు బాగా చదివి స్కూల్ కి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఐహెచ్ కార్యకర్త సయ్యద్ మాలిక్, ప్రిన్సిపల్ డి డానియల్, ఆఫీస్ ఇంచార్జ్ లలిత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

