ఘనంగా సర్ సి ఆర్ రెడ్డి అటానమస్ కళాశాల 81 వ వార్షికోత్సవ వేడుకలు
1 min read

ఈ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు
విద్యాసంస్థల సెక్రటరీ డా:ఎం బి ఎస్ వి ప్రసాద్
విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సర్ సి ఆర్ రెడ్డి అటానమస్ కళాశాల 81వ వార్షికోత్సవం కళాశాలలో ఘనంగా మంగళవారం జరిగింది. వార్షికోత్సవ సమావేశానికి గౌరవ అతిథిగా విచ్చేసిన సర్ సి.ఆర్. రెడ్డి విద్యాసంస్థల సెక్రటరీ డా.యమ్.బి.ఎస్.వి. ప్రసాద్ మాట్లాడుతూ సర్ సి ఆర్ రెడ్డి విద్యాసంస్థలలో చదువుచున్న విద్యార్థుల యొక్క యోగ క్షేమాలు చూస్తూ వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని, విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్నత శిఖరాలను ఆధిరోహించి వారి ప్రతిభను నిరూపిస్తున్నారని తెలియజేశారు. దార్శినికతతో దాతల విరాళాలతో స్థాపించబడిన కళాశాల నేటి ఆధునిక సమాజ అవసరాలకు తగిన సౌకర్యాలతో నిరంతరం మార్పులు చెందుతూ గ్రామీణ, మధ్యతరగతి, పేద ప్రజల విద్యార్థుల అభివృద్ధికి కళాశాల ఎంతో తొడ్పడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. కంచర్ల సురేష్, డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్
ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసర్చ్ –
ఐకార్,పెదవేగి ఆంధ్ర ప్రదేశ్
మాట్లాడుతూ విద్యార్థులు స్వీయ క్రమశిక్షణలతో జీవితాన్ని చక్కదిద్దుకోవాలని, చదువుపట్ల ఆసక్తిని పెంపొందించుకొని నైపుణ్యాన్ని సాధించి చట్టాలను గౌరవించాలని, వ్యసనాలకు బానిసకాకుండా చదువు అనే ఆయుధాన్ని ఉపయోగించి జీవితంలో ఉన్నతి శిఖరాలను ఆధిరోహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వంకినేని భానుప్రకాష్, జాయింట్ సెక్రటరీ, మేనేజింగ్ కమిటీ, వల్లభనేని శ్రీకృష్ణ, జాయింట్ సెక్రటరీ, మేనేజింగ్ కమిటీ, బి.బి.వి.వి. ప్రసాదరావు, ట్రెజరర్, మేనేజింగ్ కమిటీ, కానాల శ్రీనివాసరావు, కరస్పాండెంట్, సర్.సి.ఆర్.ఆర్.పి.జి. కోర్సెస్, డా.వి.ఆర్.ఎస్. బాబు యలమర్తి, డైరెక్టర్, సర్.సి.ఆర్.ఆర్.పి.జి కోర్సెస్, ఎన్. శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్, సర్.సి.ఆర్.ఆర్ ఇంటర్మీడియట్ కోర్సెస్, సర్ సి ఆర్ రెడ్డి కళాశాల, విశ్రాంత అధ్యాపకులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

