NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యువత విద్యార్థి దశనుండే సామాజిక బాధ్యత కలిగి ఉండాలి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వి. వెంకట బసవరావు సూచించారు. రాయలసీమ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు వర్సిటీకి సమీపంలోని సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజీ వద్ద ఏర్పాటుచేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ్ కుమార్ నాయుడుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం వేసవి కాలంలో ప్రజలకు చల్లదనం అందించడమే లక్ష్యంగా విద్యార్ధులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. విద్యార్థులు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టి కొనసాగించాలని ఆచార్య బసవరావు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ కాలేజీ అధ్యాపకులు వి. సతీష్ కుమార్, శివ ప్రసాద్ రెడ్డి,  కే. చిన్నయ్య , విద్యార్థులు ఠాగూర్ నాయక్, భువనేశ్వర్, మనోజ్, సాయి దినేష్ , హరి పాల్గొన్నారు.

About Author