NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అర్హత ఉన్న పేదలకు పెన్షన్లు, ఇంటి స్థలాలు తక్షణమే ఇవ్వాలి

1 min read

మార్చి 24వ తేదీ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనకి పిలుపు

 సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అర్హత ఉన్న పేదలకు ఇంటి స్థలాలు, పెన్షన్లు తక్షణమే ఇవ్వాలని కోరుతూ మార్చి 24 తారీఖున సిపిఐ ఆందోళనలను జయప్రదం చేయండి.సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పిలుపు. పట్టణాలలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి.సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య విజ్ఞప్తి.   భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా మార్చి 24 మంగళవారం నాడు అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు, పక్కా ఇండ్ల నిర్మాణం, పెన్షన్లు, సాగు భూములకై జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలలో అర్హులైన పేదలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ  చైతన్య, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని, జీవో ఎంఎస్ నెంబర్ 23ను సడలించాలని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలని, పట్టణాలలో మరియు గ్రామాలలో దళితవాడలో శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్స్ తో ఈనెల 24వ తేదీ న సిపిఐ తలపెట్టిన ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మరియు ప్రజా సంఘాల నాయకులు పిట్టా ప్రసాద్, కంచర్ల గురవయ్య, రెడ్డి శ్రీనివాస్ డాంగే, టీవీఎస్ రాజు, రాయంకుల లక్ష్మణరావు, దొంతా కృష్ణ, గన్ను వెంకటరావు, బి ఎన్.సాగర్, పిపి శాస్త్రి, మన్నవ యామిని, యర్రా వెంకటేశ్వర్లు టి విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.

About Author