విద్యార్థులతో డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగరంలోని రిడ్జ్ స్కూల్‌లో “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం ఈగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. సబ్ ఇన్‌స్పెక్టర్ సృజన్ కుమార్ , హెడ్ కానిస్టేబుల్ ఎలీష విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలు మరియు వివిధ ఆపరేషన్లపై అవగాహన కల్పించారు.డ్రగ్స్‌కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. చివరగా విద్యార్థులతో డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సి.ఇ.ఓ గోపీనాథ్ మరియు డీన్ రాజేంద్రన్ మరియు ప్రిన్సిపాల్ శ్రీమతి రాజ్ కమల్ మాథ్యూస్ పాల్గొని విద్యార్థులకు తగిన సూచనలు ఇచ్చారు.

