జిల్లా అభివృద్ధికి పరిశ్రమలే ముఖ్యం
1 min read

ఎం ఎస్ ఎం ఈ పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాలి
తలసరి ఆదాయం పెంపు లక్ష్యంగా పని చేయాలి.
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు : జిల్లా అభివృద్ధికి పరిశ్రమలే పునాది అని, తలసరి ఆదాయం పెంచేందుకు పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించాలనిజిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు.బుధవారం కలెక్టరేట్ మిని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…జిల్లాలో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం క్రింద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పరిశ్రమల ప్రోత్సాహకాన్ని వినియోగించుకొని మహిళలు, ఎస్సీ, ఎస్టీలు పరిశ్రమలు స్థాపించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తలసరి ఆదాయాన్ని పెంచడం అత్యంత ముఖ్యమని, ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ సూచించారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పి.యం విశ్వకర్మ పథకంలో పురోగతి సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. కర్నూలు జిల్లా నీటి వనరులు తక్కువగా ఉండటం, అక్షరాస్యత శాతం కూడా తక్కువగా ఉండటం వంటి సమస్యలను అధిగమించేందుకు ప్రతి శాఖ తమ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. జిల్లా పరిస్థితులను మెరుగుపరచడానికి అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సంబంధించి మొత్తం 35 ఎంఓయూలు కుదిరాయని, అందులో 11 యూనిట్లు గ్రౌండింగ్ పూర్తిచేసి నిర్మాణ దశలో ఉన్నాయని, 15 యూనిట్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. సమావేశంలో జిఎం ఇండస్ట్రీస్ అశోక్ కుమార్, కర్నూల్ మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ,ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి , పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిషోర్ రెడ్డి, నేడ్కాప్ డివో వీరేంద్ర, జెడి వ్యవసాయ శాఖ వరలక్ష్మి , ఏపీఎంఐపి పిడి సుధాకర్ , ఎల్డీఎం రామచంద్రరావు , మార్కెటింగ్ ఏడీ నారాయణమూర్తి, డి సి ఎల్ వెంకటేశ్వర్లు, జడ్.ఎం మధుసూదన్ , పరిశ్రమల శాఖ డిడి లు జవహర్ బాబు, డేనియల్ తదితరులు పాల్గొన్నారు.

