NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యోగుల పెండింగ్ బకాయిల  విడుదల చేస్తున్నందుకు సీఎం కి కృతజ్ఞతలు

1 min read

రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు కల్పించే బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడం  గర్వకారణం.

కర్నూలు, న్యూస్​ నేడు:  ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మరియు జెఏసి చైర్మన్ శ్రీ.అలపర్తి విద్యాసాగర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ.డి.వి. రమణ  కృషితో ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు చెల్లింపు కొరకు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ. 7,000 కోట్లకు పైగా బకాయిల విడుదలకు ఆమోదం తెలపడం ఉద్యోగులకు ఎంతో ఊరటనిచ్చే సానుకూల చర్య .బకాయిలు విడతల వారీగా చెల్లిస్తున్నప్పటికీ, వాటి విడుదల వేగవంతం కావాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ప్రభుత్వం, ఉద్యోగులు మరియు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ చెల్లింపుల కోసం మొత్తం రూ. 7,059 కోట్లు విడుదలకు ఆమోదం.  ఈ మొత్తంలో : రూ.1,847.83 కోట్లు-జనరల్ ప్రావిడెంట్ ఫండ్, రూ.3,411.03 కోట్లు-గ్రాట్యుటీ బకాయిలు, రూ.1,800 కోట్లు-పదవీ విరమణ పొందిన ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, రూ.223.47 కోట్లు-పోలీసు సిబ్బందికి అదనపు స‌రెండర్ లీవ్ చెల్లింపులు ఉన్నాయి. అలాగే, జి పి ఎఫ్ కింద రూ.1,847.83 కోట్లు, గ్రూప్ ఇన్సూరెన్స్,  జీవిత బీమా కింద రూ.76 కోట్లు ఇప్పటికే విడుదల చేసినట్లు తెలిపారు.ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం, పెండింగ్ ఆర్థిక అంశాల పరిష్కారానికి ముందుకు రావడం అభినందనీయం. ఈ పురోగతి ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నిరంతర కృషి మరియు రాష్ట్ర ప్రభుత్వ సానుకూల దృక్పథం ఫలితమని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల హక్కులు మరియు సంక్షేమం కోసం అసోసియేషన్ ఎప్పటికీ కట్టుబడి పనిచేస్తుందని, అలాగే, పి.ఆర్.సి కమిటీ నియామకం, స‌రెండర్ లీవ్‌కు సంబంధించిన బిల్లులు సహా ఇతర పెండింగ్ బిల్లుల త్వరిత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని  కోరుతున్నాము.ఈ సందర్భంగా, ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిల చెల్లింపుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, మరియు APNGGOs Association రాష్ట్ర అధ్యక్షులు  A. Vidya Sagar కి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ D.V. Ramana కి ధన్యవాదములు..APNGGOs అసోసియేషన్, కర్నూలు జిల్లా.

About Author