NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి

1 min read

ఏప్రిల్ 10 నుండి 12 వరకు అనంతపురం జిల్లాలో పాదయాత్రను జయప్రదం చేయండి

 సిపిఐ, బికెఎంయు ఆధ్వర్యంలో కార్యక్రమం

 సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరుతూ ఏప్రిల్ 10 నుండి 12 వరకు అనంతపురం జిల్లాలో జరుగుతున్న సిపిఐ, బికెఎంయూల ఆధ్వర్యంలో పాదయాత్రను జయప్రదం  చేయవలసిందిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, బి కే ఎం యు ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి గోలిమే బాల యేసు వ్యవసాయ కార్మికులకు పిలుపునిచ్చారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10 నుంచి 12 వరకు అనంతపురం నుంచి నార్పల మండలం బండ్లపల్లి వరకు బికేఎంయు మరియు సిపిఐ ఆద్వర్యంలో నిర్వహించే పాదయాత్రకు సంబంధించిన గోడపత్రికలను శనివారం నాడు ఏలూరు సిపిఐ జిల్లా కార్యాలయంలో సిపిఐ, బి కే ఎం యు నాయకులు  ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, బి కే ఎం యు జిల్లా సహాయ కార్యదర్శి గోలిమే బాల యేసు, జిల్లా కమిటీ సభ్యులు గుమ్మడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ  ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం ప్రభుత్వం  కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ పేద ప్రజలకు అన్యాయం చేస్తుందని విమర్శించారు.  యూపీఏ వన్ ప్రభుత్వంలో వామపక్ష పార్టీల ఎంపీల  మద్దతుతో  ఈ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. 2005లో  అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో  అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి  ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఉపాధి హామీ చట్టాన్ని  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం వల్ల  వ్యవసాయ కూలీలు, కష్టజీవులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఏలూరు జిల్లా నుంచి పాదయాత్రకు బి కే ఎం యు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు. గోడపత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో బి కే యం యు జిల్లా ఉపాధ్యక్షులు కూరాకుల బాబురావు, జిల్లా కమిటీ సభ్యులు తాడిగడప జయరాజు, యడ్లపల్లి రమేష్, సిపిఐ నాయకులు యు హేమ శంకర్, తొర్లపాటి బాబు, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *