NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాల్ ప్రాక్టీస్ చేస్తే.. రెండేళ్ల డీబార్…!

1 min read

డా. ఎన్టీ ఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. చంద్ర శేఖర్

ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలను ఆకస్మిక తనిఖీ  చేసిన వీసీ

పరీక్షల నిర్వహణ.. సంతృప్తికరంగా ఉందని వెల్లడి

కర్నూలు హాస్పిటల్ , న్యూస్ నేడు : మెడికల్ విద్యార్థులు పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే రెండేళ్లు డీబార్ చేస్తామని డా. ఎన్టీ ఆర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. చంద్ర శేఖర్ సూచించారు.  హెల్త్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలన్నీ పక్బందీగా… సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. శనివారం  కర్నూలు మెడికల్ కాలేజీలో జరుగుతున్న ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పార్ట్ 2 పరీక్ష కేంద్రాన్ని  డా. చంద్ర శేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు.   ఈ సందర్భంగా  వీసీ డా. చంద్ర శేఖర్  మాట్లాడుతూ  రాష్ట్రంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల్లో జరుగుతున్న ఫైనలియర్ పార్ట్ 2 పరీక్షలను యూనివర్సిటీ నుంచి ప్రత్యేక బృందాలు ఆకస్మికంగా తనిఖీ ప్రక్రియను ప్రారంభించామని ఆయన తెలిపారు.  విజయవాడలోని  మెడికల్ కాలేజీలో ఫైనలియర్ పార్ట్ 2 పరీక్షలను యూనివర్శిటీ ప్రత్యేక బృందం తనిఖీ చేసిందని, త్వరలో రిజిస్ట్రార్ కూడా పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తారని తెలిపారు.  మెడికల్ విద్యార్థులు పరీక్షల సమయంలో ఎటువంటి ప్రలోభాలకు గురికావద్దని సూచించారు. అనంతరం అడిషనల్ డీఎంఈ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ పరీక్షల నిర్వహణ తీరును ఏర్పాట్లను వివరించారు.  అదేవిధంగా 90 శాతం పూర్తయిన లెక్చరర్ గ్యాలరీ  నిర్మాణం 90 శాతం పూర్తయిందని,  కేవలం ఎలక్ట్రిఫికేషన్ ఇంటర్నల్ గా సౌండ్ సిస్టం వాటి పనులు పెండింగ్ ఉన్నాయని వాటిని పూర్తి చేస్తే  విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని విసికి తెలిపారు.    పెండింగ్ పనులపై త్వరలో నిర్ణయాలు తీసుకుంటామనీ విసి తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సింధియా శుభప్రద, యూనివర్సిటీ స్పెషల్ అబ్జర్వర్ ప్రొఫెసర్ రంగయ్య , పరీక్షల చీఫ్ సూపరెండెంట్ ప్రొఫెసర్ రాజేష్ పరీక్ష నిర్వహణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *