అమరావతిని రాజధానిగా పార్లమెంటులో ఆమోదం చేయటం ప్రజలకు శుభపరిణామం
1 min read

శాసనసభ్యులు బోడే ప్రసాద్
పెనమలూరు , న్యూస్ నేడు: నియోజకవర్గం,తాడిగడప మున్సిపాలిటీ పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో అమరావతిని రాజధానిగా పార్లమెంటులో ఆమోదం చేయడంతో కూటమి నాయకులతో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పార్టీ కార్యాలయం నుంచి తాడిగడప ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి…టపాసులు కాల్చి అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు కార్యకర్తలు ఆనంద ఉత్సాహాలతో,జై జై ధ్వనాలతో బందరు రోడ్డు మారుమోగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ.ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి కి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడం ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడం పై,ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవ ప్రత్యేక గుర్తింపుగా భావిస్తున్నాను అన్నారు.రాబోయే మూడు సంవత్సరాల్లో అమరావతి రాజధాని ని పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు.అమరావతిని శాశ్వత రాజధానిగా పార్లమెంటులో ఆమోదం వచ్చేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రి లోకేష్ కి,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,బిజెపి కేంద్ర ప్రభుత్వానికి పెనమలూరు నియోజకవర్గం తరఫునుంచి ధన్యవాదాలు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పీత గోపీచంద్ రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ తాతపూడి గణేష్ రాష్ట్ర సగర కార్పొరేషన్ డైరెక్టర్ తాడిశెట్టి వీరాస్వామి దుర్గగుడి పాలకమండలి సభ్యులు వెలగపూడి శంకర్ బాబు మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్ కోనపు రెడ్డి వాసు చంపని వెంకటేశ్వరరావు జంపాన గురునాథం పెనమలూరు మండల పార్టీ అధ్యక్షులు కోయ ఆనంద ప్రసాద్ బిసి సెల్ అధ్యక్షులు సంగేపు రంగారావు తుమ్మల రామకుమార్ మేడసాని రత్నకుమారి యార్లగడ్డ సుచిత్ర అంగిరేకుల మురళి బుర్ర వెంకట్ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

